సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తో పాటు అందం కూడా ఎక్కువగానే ఉండాలి. ఒక్కోసారి ఈ రెండు ఉన్నా కానీ అదృష్టం కలిసి రాక కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. మరికొంతమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ గా ఎదుగుతారు. అలాంటి ఈ గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలి అంటే అంత ఆశా మాషి వ్యవహారం ఏమీ కాదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో అమ్మాయిలు అనేక ఇబ్బందులు పడతారని ఎప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.  ప్రస్తుతం స్టార్లుగా కొనసాగుతున్నటువంటి కొంతమంది నటీమణులు నిర్మాతలు, డైరెక్టర్, హీరోల చేతిలో ఎన్నో ఇబ్బందులు పడ్డవారే. ఈ మధ్యకాలంలో వారు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పడ్డ ఇబ్బందుల గురించి ఇంటర్వ్యూలలో బయటపెడుతున్నారు.  

అలాంటి ఈ తరుణంలో ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్ పర్సన్  నేరెళ్ల శారద షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలామంది దర్శక నిర్మాతలు, నటులు, అవకాశాల కోసం వచ్చిన అమ్మాయిలను మోసం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. వారి చేతిలో మోసపోయిన చాలామందిలో న్యాయం కోసం పోరాటం చాలా తక్కువ మంది చేస్తున్నారని హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్ పర్సన్ తెలియజేసింది. గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలనే కోరికతో చాలామంది అమ్మాయిలు అవకాశాల కోసం వెతుకుతారు. దాన్ని అదునుగా భావించిన కొంతమంది వారిని లోబరుచుకుంటున్నారు. ఈ కేసులు నా దగ్గరికి చాలానే వస్తున్నాయి, కానీ వాళ్ళు చివరి వరకు ఆ కేసులో నిలబడరు. దీనివల్ల అది మధ్యలోనే సమసి పోతుంది.

కేసు నా వద్దకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలు ఏదైనా సెట్ చేస్తున్నారా లేదంటే భయపెడుతున్నారా తెలియదు కానీ మధ్యలోనే ఆ కేసును విత్ డ్రా చేసుకుంటున్నారు.  ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద నిర్మాత చేసిన అన్యాయంపై ఒక కేసు మావద్దకు వచ్చింది. పిల్లలు ఉన్నా కానీ ఒక అమ్మాయిని నువ్వే నా భార్య అంటూ తీవ్రంగా మోసం చేశారు. ఆ నిర్మాత పేరు నేను చెప్పలేను. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఈ భూమి మీద కాకుండా మరో లోకంలో ఉన్నట్టు ఫీల్ అవుతారు. వారికి సంబంధించిన ఎలాంటి విషయాలను కూడా బయటకు రానివ్వకుండా ముందుగానే సర్దుకుంటారని నేరెళ్ల శారద తెలియజేసింది. అలాగే నిర్మాత రీసెంట్ గానే బ్లాక్బస్టర్ సినిమా చేశారు అంటూ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ నిర్మాత ఎవరా అని చాలామంది ఆలోచనలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: