ఇండియాలో మారుతి సుజుకి ఈకోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది.గత కొన్ని సంవత్సరాలగా మార్కెట్లో తిరుగులేని అమ్మకాలతో చాలా స్పీడ్ గా పరుగులు పెడుతోంది. ఇక రీసెంట్ గా విడుదలైన కొన్ని నివేదికల గణాంకాల ప్రకారం 'ఈకో'  కార్ ఏకంగా 10 లక్షల యూనిట్ల అమ్మకాలను తన ఖాతాలో వేసుకుంది.ఇండియాలో మారుతి ఈకో కేవలం ప్రయాణ వాహనంగా మాత్రమే కాకుండా ఇంకా అలాగే వ్యాపార వినియోగాలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతోంది. ఈ కారణంగానే అతి తక్కువ కాలంలోనే దేశంలో ఎక్కువ అమ్మకాలు పొందిన వ్యాన్‌గా ఈ కార్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇది 5 సీటర్, 7 సీటర్, కార్గో, టూర్ ఇంకా అంబులెన్స్ వంటి దాదాపు 13 వేరియంట్‌లలో మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.మార్కెట్లో వ్యాన్ అమ్మకాలలో మారుతి ఈకో మొత్తం 94 శాతం వాటా కలిగి ఆ విభాగంలో ఒక రేంజిలో ఆధిపత్యం చెలాయిస్తోంది.


కార్ మొదటి 5 లక్షల యూనిట్లను విక్రయించడానికి 8 సంవత్సరాలు పడితే, మరో 5 లక్షల కార్లు విక్రయించడానికి కేవలం ఐదేళ్ల కంటే తక్కువ సమయం పట్టింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఈకో అమ్మకాలు అనేవి క్రమంగా పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది.ఇక మారుతి ఈకోలో రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ ఫోకస్డ్ కంట్రోల్స్ వంటి ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇంకా ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఇల్యూమినేటెడ్ హజార్డ్ స్విచ్ అలాగే ఏబీఎస్ విత్ ఈబిడి వంటి 11 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్  ఉన్నాయి.మారుతి సుజుకి ఈకో 1.2-లీటర్, K12C, డ్యూయల్ జెట్, డ్యూయల్ వివిటి ఇంకా న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌ కలిగి 80 బిహెచ్‌పి పవర్ అలాగే 104.4 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. cng వెర్షన్ 71 బిహెచ్‌పి ఇంకా 95 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో యాడ్ చేయబడి ఉంటాయి. పెట్రోల్ మోడల్ 20.20 కిమీ/లీ మైలేజ్ ని అందిస్తే, cng మోడల్ వచ్చేసి 27.05 కిమీ/కేజీ అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: