అదే అపాచీ ఆర్టీఆర్ 160 4వీ. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.07 లక్షలుగా నిర్దేశించింది. గత మోడల్ తో పోలిస్తే ఈ మోటార్ సైకిల్ వేరియంట్ల ధరలను కాస్త పెంచింది. రెండు మోడళ్లలో దాదాపు రూ.3000ల ధరను పెంచింది. అంతేకాకుండా వీటిలో కొన్ని కీలక మార్పులు, అప్డేట్లను కూడా చేసింది టీవీఎస్. బరువు 2 కేజీలు తగ్గించింది. ఇప్పుడు అపాచీ ఆర్టీఆర్ 160 4వీ డ్రమ్ వేరియంట్ 145 కేజీల ఉండగా, డిస్క్ వేరియంట్ మాత్రం 145 కేజీలు బరువు ఉంటుంది.
ఈ సరికొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మోటార్ సైకిల్లో ఆల్ న్యూ డ్యూయల్ టోన్ సీటుతో కూడిన కార్బర్ ఫైబర్ ప్యాటర్న్ ను పొందుపరిచారు. అంతేకాకుండా క్లా షీల్డుతో కూడిన ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు ఇందులో అదనపు ఆకర్షణ. ఈ మోటార్ సైకిల్లో మూడు పెయింట్ స్కీములు ఉన్నాయి. రేసింగ్ రెడ్, నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ లాంటి కలర్స్ లో ఈ బైక్ అందుబాటులో ఉంది. 150 నుంచి 160సీసీ సిగ్మెంట్లో భారత్ లో ఈ ఏడాదిలోనే అత్యంత శక్తిమంతమైన బైక్ గా గుర్తింపు తెచ్చుకుంది. భారత మార్కెట్లో ఈ మోటార్ సైకిల్ కు పోటీగా బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160, సుజుకీ జిక్సెర్ 155 లాంటి వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి