ఇక దశాబ్ధాల విరామం తర్వాత ఇండియా మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ అయిన 'జావా మోటార్‌సైకిల్స్', ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక ఈ విషయాన్ని జావా మోటార్‌సైకిల్స్ సీఈఓ ఆశిష్ సింగ్ జోషి ధృవీకరించడం జరిగింది.ఇక ఇండియా మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఇక జావా మోటార్‌సైకిల్స్ ఇప్పటికే ఓ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌ బైక్ పై పని చేస్తోంది. యూకేలోని కోవెంట్రీలో తాము ఓ కొత్త డెవలప్‌మెంట్ సెంటర్‌ను కలిగి ఉన్నట్లు ఆశిష్ తెలిపడం జరిగింది.ఇక ఈ డెవలప్‌మెంట్ సెంటర్‌ బిఎస్ఏ బ్రాండ్ కోసం పనిచేస్తోందని, ఇది 12-15 మంది ఉద్యోగుల బృందాన్ని కలిగి ఉందని ఆయన చెప్పడం జరిగింది. ఇక ఈ-బైక్‌లో వాడే ఎలక్ట్రిక్ టెక్నాలజీని ప్రస్తుతం ఈ ఆర్ అండ్ డి సెంటర్‌లో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపడం జరిగింది.

ఇక నివేదికల ప్రకారం చూసుకున్నట్లయితే జావా మోటార్‌ బైక్స్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను 2022 మధ్య నాటికి మార్కెట్లో విడుదల చేయవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ రెట్రో-మోడ్రన్ బ్రాండ్ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఉత్పత్తిని కంపెనీ ఇండియాలోనే చేసే అవకాశం ఉందట.ఇండియా మార్కెట్లో జావా ఎలక్ట్రిక్ మోటార్‌ బైక్ ధరను అందుబాటులో ఉంచేందుకు గానూ ఆ కంపెనీ దీని ప్రొడక్షన్ లో ఎక్కువ భాగం లోకలైజేషన్ చేయనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఇక దీని డిజైన్‌ను కూడా కంపెనీ తమ ఐకానిక్ రెట్రో స్టైల్‌లోనే ఉంచే అవకాశం ఉందట.కాకపోతే దీన్ని ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా ఇందులో అనేక ఆధునిక ఫీచర్లను జోడించనున్నారట.ఇక టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఈవీ ఇంకా స్టాండర్డ్ నెక్సాన్ కార్ల మధ్య వ్యత్యాసాన్ని చూపేందుకు అలాగే ఎలక్ట్రిక్ వెర్షన్ నెక్సాన్‌లో కంపెనీ బ్లూ కలర్ యాక్సెంట్‌లను జోడించినట్లుగా జావా కూడా తమ పెట్రోల్ పవర్డ్ ఇంకా ఎలక్ట్రిక్ పవర్డ్ మోటార్‌సైకిళ్ల మధ్య వ్యత్యాసాన్ని బాగా చూపేందుకు ఈ తరహా స్ట్రాటజీనే పాటించే అవకాశం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: