టీనేజ్ లో యువతీ యువకులకు ఎంతగానో ఇబ్బంది పెడుతుంటాయి..మొటిమలు.  మొటిమలకు, స్ట్రెస్ కు సంబంధం ఉంది. సాధారణంగా, నొప్పిగా అన్పించే మొటిమలు, ఋతుక్రమం సమయంలోను, పరీక్షలకు ముందు, లేదా చాలా ముఖ్యమైన సంఘటన జరిగే ముందు, ముకం మీద మొలుస్తాయి. ఆయా సమయాల్లో మీలో స్ట్రెస్ ఎక్కువగా వుంటుంది. స్ట్రెస్ పెరిగినపుడు, ఆండ్రోజిన్ హార్మోను మరింత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. స్ట్రెస్ ఏర్పడినపుడు ఆండ్రోజిన్ బారి నుండి తప్పించుకోవటానికయినా ఎదురు నిలిచి పోరాడటానికయినా మీ శరీరాన్ని సిద్దపరిచేందుకుగానీ ఆండ్రోజిన్ స్రావం అధికమవుతుంది.

Image result for మొటిమలు apherald

ఇదే ఆండ్రోజిన్ మొటిమలు ఏర్పడటానికి కూడా తోడ్పడ్తుంది. ఇది సింపులుగా మొటిమలు ఏర్పటానికి వెనుకనున్నకథ.  రుతు క్రమం సరిగా ఉండనివారిలో, ఆజీర్ణంతో బాధపడేవారిలో, మానసిక ఒత్తిడికి గురయ్యేవారిలో కూడా మొటిమలు ఎక్కువగా కన్పిస్తాయి. ముఖసౌందర్యాన్ని ఇబ్బంది పెట్టే సమస్యలలో మొటివలది ప్రధాన పాత్ర, స్వభావరీత్యా వీటిలో ఎన్నో రకాలున్నప్పటికీ సుమారు 70శాతం మొటిమలను మనం తీసుకునే సంరంక్షణ ద్వారా తగ్గించవచ్చు. నివారణకు ఏం చేయాలి ? మొటిమలను గిల్లడం, నొక్కడం చేయ్యకూడదు.

Image result for మొటిమలు apherald

దానివల్ల తొందరగా మానకపోగా మచ్చపడిపోతాయి. ఎక్కువ సార్లుముఖం కడుక్కోవాలి. నీరు ఎవ్కువగా తాగాలి. ముఖంమీద కన్పించే నల్లనిగోధుమ వర్ణపు మచ్చలను తొలగించడంలో చర్మంపై మర్ధనచేసి వెంటనే శుభ్రపరుచుకోవాలి. ఇలా వారం రోజులుచేస్తే గోధుమ రంగు మచ్చలు మాయమవుతాయి. కీరదోసకాయ రసం, కొద్దిగా నిమ్మరసం, కోడిగుడ్డు తెల్లసొనతో కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం నునుపుగా తయారవుతుంది.


మనం తినే ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఉండాలి. నిమ్మ, నారింజ, ఎక్కువ వాడాలి. విటమన్ సి ఉండేట్లుగా చూసుకోవాలి. వేరుశనగ, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ పూర్తిగా మానివేయాలి. బాదం పౌడరు అరస్పూన్, కస్తూరిపసుపు చిటికెడు, కొంచెం కర్పూరం లేదా తులసి, వేప, పుదీనా ఆకుల్లో ఏదైనా ఒకటి కలిపి ముద్దగా నూరి రాత్రిపూట పడుకోబోయే ముందు ముఖానికి పట్టించి ఉదయం లేచాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఫలితం ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: