కర్ణాటక రాజకీయాల్లో పెను సంచ‌ల‌నం రేకెత్తించిన మంత్రి ర‌మేశ్ జార్కిహోళి రాసలీల సీడీ వెనుక రూ. 5కోట్ల  ఒప్పందం కుదిరింద‌ని, దీనికి సంబంధించిన సమాచారం త‌న‌వ‌ద్ద ఉందంటూ మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ఆరోపణలు చేశారు. ముందుగా సీడీ గురించి మాట్లాడే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తే అన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్నారు. ఇంకా తన వద్ద సీడీలున్నాయని ప్రకటించడం వెనుక బ్లాక్‌మెయిల్‌ కనిపిస్తోందన్నారు. ఎవరి వ్యక్తిగత జీవితాన్నైనా ఈ విధంగా చూపడం తప్పని,   తనద‌గ్గ‌రున్న‌ సమాచారం ప్రకారం మూడు నెలల కిందటే సీడీ చూపి బ్లాక్‌మెయిల్‌‌ చేశారని కుమార‌స్వామి చెప్పారు. దీని వెనుక బడా బ‌డా నేతల హస్తముందని, వారెవ‌రో త‌న‌కు తెలుసంటూ బాంబు పేల్చారు. సమాజంలో విసుగుపుట్టించే పరిస్థితి నెలకొందని కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు. ఒక మాజీ ముఖ్య‌మంత్రి ఎక్కడికెక్కడో వెళ్లివస్తారని.. ఆ సీడీ కూడా తన వద్ద ఉందని చెబుతున్నారని, అదెవరిదో చెబితే బాగుంటుందన్నారు. ప్ర‌జాజీవితంలో ఉండేవారిని అనుమానంగా చూడ‌టం మానుకోవాల‌ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: