నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కరోనా బారిన పడ్డారు. ఆయనకు పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు.  ఈ విషయాన్ని ఫ‌రూక్‌ కుమారుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌లో తెలిపారు. ‌"మా నాన్న‌గారికి కోవిడ్-19 పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. కొన్ని లక్షణాలు కనిపించాయి. నాతో పాటు కుటుంబ సభ్యులంద‌రూ ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఆ నివేదిక‌లు వ‌చ్చేంత‌వ‌ర‌కు హోం ఐసొలేషన్‌లోనే ఉంటున్నాం.  మమ్మల్ని కలిసేందుకు వచ్చినవారంతా ముందు జాగ్ర‌త్త‌గా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి"  అని కోరారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జ‌రుగుతున్నప్పటికీ కరోనా కేసులు మొద‌టిద‌శ‌క‌న్నా ఎక్కువ‌గా విజృంభిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. మరోవైపు, నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ కూడా క‌రోనా పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతుందేమోన‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: