'మహిళను అబల అంటున్నాం. ఆమే సబల అయితే, నేడు నిస్సహాయంగా దిక్కులు చూస్తున్న వారంతా శక్తిమంతులవుతారు.' అని ఎనభై ఏళ్ల కిందటే మహాత్మాగాంధీ పేర్కొన్నారు. స్త్రీలు ఎన్నో రంగాల్లో పురుషులతో సమానమే కాదు, ఒక అడుగు ముందే ఉన్నా.. పలువిధాల వివక్షతకు, దోపిడీకి గురవుతూనే ఉన్నారు.  స్త్రీని ఒకవైపు ఆదిశక్తిగా ఆరాధిస్తూనే, మరోవైపు అణచివేతకు పాల్పడు తున్నారు. అయినా కుడా..ఆడది అంటే అబల కాదు.. ఆదిశక్తి అని అనేకసార్లు నిరూపిస్తూనే ఉన్నారు మహిళలు.  కరోనా విపత్కర పరిస్థితుల్లో బయట అడుగుపెట్టేందుకే ప్రజలు భయంతో వణికిపోతుంటే..ఎంతో ధైర్యంతో మహిళలు తమ వృత్తికి న్యాయం చేస్తున్నారు. గుజరాత్ లోని సూరత్ లో నాలుగు నెలల గర్భిణీ  ఒకరు ఈసెకండ్ వేవ్ కోవిడ్ సమయంలో రోగుల సేవకు అంకితమై ఆదర్శంగా నిలుస్తోంది.  అయేజా మిస్త్రీ నాలుగు నెలల గర్భవవతి. సూరత్‌లోని అటల్ కొవిడ్‌-19 సెంటర్‌లో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో, గర్భిణీగా ఉన్న సమయంలో తాను దగ్గరుండి కరోనా బాధితులకు వైద్యసేవలు అందించడం ఎంత ముప్పో ఆమె తెలుసు. కానీ, తనకు వైరస్ నుంచి ముప్పు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా పూర్తిగా విధి నిర్వాణలో నిమగ్నమైంది. నాలుగు నెలల గర్భంతో ఈ నర్సు చేస్తున్న సేవలను అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు. ఆమె చూపిన తెగువ అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: