దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలు సంతోషంగా ఉండాలి.. అంతేకాదు వారికి కేంద్రం సాయం అందిస్తే ఆకలి చావులు ఉండవు. అంతేకాదు ప్రజలు సుభిక్షంగా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. అయితే ఈ పథకాల ద్వారా ప్రజలు కొంత వరకు లబ్ది చేకూరుతుంది. అందుకే ఇప్పుడు మరో పథకానికి మోదీ సర్కార్ శ్రీకారం చుట్టారు. ఆడపిల్ల కలిగిన తల్లి దండ్రులకు ఈ పథకం మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. 


అదేంటంటే.. సుకన్య సమృద్ధి యోజన పథకం..ప్రభుత్వం అందించే స్కీ్మ్ ‌లో డబ్బులు పెట్టడం వల్ల మీ కూతురికి బంగారు భవిష్యత్ కానుకగా ఇవ్వొచ్చు. ఈ స్కీమ్ ‌లో చేరడం వల్ల పెళ్లి, ఉన్నత చదువు కోసం కేంద్ర ప్రభుత్వం ఒకేసారి డబ్బులు అందిస్తుంది. దీని కోసం రోజుకు రూ.1 ఆదా చేస్తే సరిపోతుంది. రూపాయి తో ఏం వస్తుంది అనే సందేహం చాలా మందికి కలుగుతుంది.



కేంద్ర ప్రభుత్వం అందించే స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒకటి.. ఈ పథకం కోసం మీరు ఎక్కడికి వెళ్ళవలసిన పనిలేదు.మీరు కేవలం రూ.250తో సుకన్య సమృద్ధి అకౌంట్ తెరవొచ్చు. ఏడాదిలో రూ.250 డిపాజిట్ చేసినా సరిపోతుంది. రూ.1.5 లక్షల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. 10 ఏళ్ల లోపు ఆడ పిల్లల పేరుపై సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఆడ బిడ్డలు ఈ స్కీమ్ ద్వారా లబ్ది పొందవచ్చు.. సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా 7.6 శాతం వడ్డీ వస్తుంది. అకౌంట్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. 15 ఏళ్లు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా లక్షల్లో లబ్ది పొందవచ్చు.. ఈ పథకం ద్వారా చాలా మంది లాభ పడతారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: