బీట్‌రూట్‌ ఎన్నో మంచి గుణాలు ఉన్న ఈ బీట్‌రూట్‌ తో ఆరోగ్యంతో పాటు అందం కూడా మన సొంతం అవుతుంది. అయితే బీట్‌రూట్‌ ఎలా వాడితే అందంగా.. ఆరోగ్యంగా తయారు అవుతాం అనేది.. ఏ చిట్కాలు ఉపయోగించాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. బీట్‌రూట్‌ ఫేస్ పాక్స్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ఆరు టీస్పూన్ల బీట్‌రూట్‌ రసంలో దూది ఉండలు ముంచి, వాటిని ముఖం మొత్తం పట్టించుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఆ గోరువెచ్చని నీటిలో ముంచిన క్లాత్‌తో ముఖం తుడుచుకోవాలి. ఆంతే ఈ ఫేస్ ప్యాక్‌తో ముఖం మెరిసిపోతుంది.

 

రెండు టేబుల్‌ స్పూన్ల బీట్‌రూట్‌ గుజ్జులో, నిమ్మరసం, రోజ్‌ వాటర్‌ కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల చర్మంపై మచ్చలు తొలగిపోయి తాజాగా కనిపిస్తుంది. 

 

అలాగే ఒక టేబుల్‌ స్పూను బీట్‌రూట్‌ రసంలో పసుపు, మీగడ, సెనగపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌గా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం తేమగా అందంగా తయారవుతుంది. 

 

చూశారుగా ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని ఆరోగ్యంగా అందంగా తాజాగా మార్చుకోండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: