టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన అంశం ఒకటే. అదే… స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహారం. ఒక వైపు ఎన్టీఆర్, మరో వైపు అల్లు అర్జున్. ఈ ఇద్దరు టాప్ స్టార్స్ మధ్య త్రివిక్రమ్ నిజంగానే గేమ్ ఆడుతున్నాడా..? అంటే ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాధానం మాత్రం “అవును” అనేలా ఉంది.వాస్తవానికి త్రివిక్రమ్ మొదటగా ఓ భారీ మైథలాజికల్ కథను అల్లు అర్జున్ కోసం సిద్ధం చేశాడు. బ‌న్నీ ఇమేజ్‌కు తగ్గట్టుగా, కొత్తగా ఉండే కథ, విజువల్ వండర్‌గా నిలిచే స్క్రీన్‌ప్లేను రూపొందించాడని అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది. అయితే అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఎందుకు ఆగిపోయిందన్న విషయం మాత్రం బయటకు రాలేదు. దీంతో ఆ కథను పక్కన పెట్టేశారని అంతా అనుకున్నారు.


కానీ కథ అక్కడితో ఆగలేదు. అదే కథను త్రివిక్రమ్ ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఎన్టీఆర్ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ పూర్తయిన వెంటనే, ఈ మైథలాజికల్ సినిమా పట్టాలెక్కుతుందని అప్పట్లో బలమైన ప్రచారం జరిగింది. ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది ఓ డిఫరెంట్ జానర్‌గా నిలుస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. తాజా సమాచారం ప్రకారం… ఆ కథ మళ్లీ అల్లు అర్జున్ దగ్గరకు చేరిందట. వెంకటేష్‌తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే, బ‌న్నీతో ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. ఇది వినిపించగానే ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి.



ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ సమ్మర్‌కే పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత బ‌న్నీ ఎవరి దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేస్తాడు అనే అంశంపై అభిమానుల్లో భారీగా చర్చ జరుగుతోంది. బోయపాటి శ్రీను, లోకేష్ కనగరాజ్ లాంటి పేర్లు గట్టిగా వినిపించాయి. అలాంటి సమయంలో త్రివిక్రమ్ – బ‌న్నీ కాంబో మళ్లీ సెట్ అవుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు.ఇప్పుడు అకస్మాత్తుగా త్రివిక్రమ్ మళ్లీ బ‌న్నీ లైన్‌లోకి రావడం టాలీవుడ్‌లో నిజంగా షాకింగ్ డెవలప్‌మెంట్‌గా మారింది. మరి ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందన్న ప్రశ్న ఇప్పుడు ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. డేట్స్ సమస్యా? కథపై పూర్తి క్లారిటీ లేదా? లేక ఇతర కమిట్‌మెంట్స్ కారణమా? అన్న అంశాలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.



గమనించాల్సిన విషయం ఏంటంటే… అప్పట్లో బ‌న్నీ ఈ కథను వదిలేసినప్పుడు కూడా అసలు కారణాలు బయటకు రాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనూ అదే పరిస్థితి రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. త్రివిక్రమ్ ప్లానింగ్‌లో నిజంగా ఏం జరుగుతోంది? చివరికి ఈ మైథలాజికల్ కథ ఎవరి ఖాతాలో పడుతుంది? అన్నది మాత్రం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. టాలీవుడ్‌లో ఈ ట్విస్ట్ ఎలా ముగుస్తుందో చూడాలి మరి…!!?

మరింత సమాచారం తెలుసుకోండి: