ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఈ చలికాలంలో చాలా మందికి చర్మం పగిలి చాలా డ్రై గా ఉంటుంది. అయితే ఈ బాడీ లోషన్ వల్ల చర్మం పగుళ్లు తగ్గి బాడీ చాలా మృదువుగా మెరిసిపోతూ ఉంటుంది... ఈ బాడీ లోషన్ ని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

కావాల్సిన పదార్ధాలు....షియా బటర్ - ఒక కప్పు,కొబ్బరి నూనె - రెండు టేబుల్ స్పూన్లు,బాదం నూనె - రెండు టేబుల్ స్పూన్లు,ల్యావెండర్ ఎస్సెన్షియల్ ఆయిల్ - కొన్ని చుక్కలు....

తయారు చేసే పద్ధతి.....ఒక ప్యాన్ తీసుకుని అందులో షియా బటర్ వేసి లో హీట్ మీద ఈ బటర్ ని కరిగించండి.తరువాత, వేడి చేయబడిన బటర్ కి కొబ్బరి నూనె, బాదం నూనె కలపండి. బాగా మిక్స్ చేయండి.ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద నుండి దింపేసి చల్లారనివ్వండి.ఇప్పుడు ల్యావెండర్, లేదా మీకు నచ్చిన ఎస్సెన్షియల్ ఆయిల్ కలిపి బాగా మిక్స్ చేయండి.ఇప్పుడు ఒక సీసాలోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోండి. మీకు అవసరమయినప్పుడల్లా వాడుకోవచ్చు.ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: