కనుబొమ్మలు ఎంత అందంగా ఉంటే అమ్మాయి అందం అంత రెట్టింపు అవుతుంది. కనుబొమ్మల ఆకృతిని మార్చడానికి ఎంతోమంది అమ్మాయిలు పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా సెలూన్ స్టైల్ రావాలని వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ కనుబొమ్మలు మాత్రం కొంతమందిలో పలుచగా ఉంటాయి. అలాంటి వారు మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ తో పాటు కాస్మెటిక్స్ తెచ్చి వాడుతున్నారు.కానీ ప్రస్తుతం ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి,మీ కనుబొమ్మలను  ఒత్తుగా ఎలా తయారు చేసుకోవాలో? ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.


ముఖ్యంగా ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో పావు టేబుల్ స్పూన్ ఆముదం నూనెను తీసుకోవాలి. ఇక అంతే మోతాదులో వ్యాజిలైన్ పెట్రోలియం జెల్లీ ను తీసుకొని, రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఇక ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ పడుకునే ముందు ఐబ్రోస్ పై అప్లై చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ప్రతి రోజూ ఇలా చేయడం వల్ల రెండు వారాల తర్వాత మీ కనుబొమ్మలు ఒత్తుగా పెరగడాన్ని మీరు  గమనించవచ్చు.


ఆముదం, పెట్రోలియం జెల్లీలోని మాయిశ్చరైజర్  గుణాలు కనుబొమ్మలను మాయిశ్చరైజ్ చేసి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.ఈ మిశ్రమాన్ని కేవలం కనుబొమ్మలకు మాత్రమే  కాకుండా కనురెప్పలకు కూడా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

అంతేకాకుండా విటమిన్ ఇ  క్యాప్సిల్స్ కూడా కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతాయి. విటమిన్ ఇ  క్యాప్సిల్ లోని జెల్ ను  అరచేతిలోకి వేసుకొని,  మునివేళ్లతో కనుబొమ్మలతో పాటు కనురెప్పల పై కూడా అతి సున్నితంగా మర్దన చేయాలి. ఈ పద్ధతిని కూడా రాత్రి పడుకోబోయే ముందు చేయడం ఉత్తమం. ఉదయాన్నే చల్లని నీటితో కడిగేసుకుంటే,ఒకటి నుండి రెండు వారాల లోపు కనుబొమ్మలతో పాటు కనురెప్పలు కూడా పెరగడం గమనించవచ్చు. కాబట్టి పైన తెలిపిన రెండు పద్ధతులను పాటించి పలుచని మీ కనుబొమ్మలను ఒత్తగా తయారు చేసుకొని,మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: