అందం విషయంలో సాధారణంగా అన్ని రకాల వయసు వారు ఎంతో కొంత ఆసక్తి కనబరుస్తుంటారు. అదే విధంగా తల్లులు కూడా తమ పిల్లలు అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని, అందరి చేత మీ పిల్లలు చాలా బాగున్నారండి అని అనిపించుకోవాలని చాలా సంతోష పడుతుంటారు. అయితే వారి చర్మం చాలా మృదువుగా, సున్నితంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త చాలా అవసరం. పూర్తిగా తెలుసుకోకుండా చిన్నారుల చర్మంపై ప్రయోగాలు చేయకండి. ఇక మీ చిన్నారులకు ఎటువంటి సోపు వాడాలి, ముఖానికి సున్ని పిండి వాడాలా లేదా ఇక మరేదయినా వాడాలా అని ఆరాటపడుతుంటారు. అయితే చాలా మంది తల్లులు చెబుతున్న మాట ఏమిటి అంటే పిల్లలకు డెర్మా డ్యూ, మైసూర్ శాండిల్, ఓల్డ్ సింతాల్ సోపులు బాగా పనిచేస్తున్నాయని ఉత్తమమైన ఫలితాలను అందిస్తాయని అంటున్నారు.

మైసూర్ శాండిల్ మరియు చింతాల్ సోప్ అందరికీ అందుబాటు ధరలో ఉండే మంచి సోపులలో ఒకటిగా చెబుతున్నారు. వీటి వలన పిల్లల చర్మం మంచి రంగులోకి మారుతుందని అంటున్నారు. అలాగే ఇంట్లో తయారు చేసుకునే సున్ని పిండి అన్నింటికన్నా ఉత్తమం అని అంటున్నారు, లేదా పిల్లల కోసం బయట దొరికే వాటిలో సుబ్రా హెర్బల్ బాత్ పౌడర్ కూడా బాగుందని అంటున్నారు. కాకపోతే ఇది వాడిన పూట ముఖానికి సోపు వాడకండి. రెండో పూట సోపును వాడొచ్చు.

ఇవి కేవలం మనకు తెల్సిన సహజమైన పద్ధతులు. అలా కాకుండా మీ పిల్లల చర్మం కొంచెం డిఫరెంట్ గా వుంటే ఖచ్చితంగా మీరు డెర్మాటాలజిస్ట్ ను కలిసి తగిన సోప్ లేదా మాయిశ్చరైజర్స్ ను వాడవచ్చు. మీరు సొంతంగా ఎటువంటి ప్రయోగం చేయదలుచుకున్న పూర్తిగా తెలుసుకుని మాత్రమే చేయండి. లేదంటే పిల్లల చర్మం పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాలు తెలుసుకుని సరైన ప్రొడక్ట్స్ వాడండి

మరింత సమాచారం తెలుసుకోండి: