కొంతమందికి చుండ్రు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో అయితే ఈ సమస్య ఇంకా దారుణంగా పెరుగుతుంది. చాలా మంది చుండ్రు సమస్య నుంచి బయటపడేందుకు ఎక్కువగా రసాయనాలు కలిపిన యాంటీ డాండ్రఫ్ షాంపూలను వాడుతుంటారు. ఇది జుట్టు ఆరోగ్యాన్ని ఖచ్చితంగా నాశనం చేస్తుంది. కాబట్టి చుండ్రు సమస్యకు ఎల్లప్పుడూ హోం రెమెడీస్‌ని పాటించడం ఉత్తమం.కలబందలో ఎన్నో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. కలబంద స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ ఇంకా చుండ్రును చాలా సులభంగా తగ్గిస్తుంది. తాజా కలబంద జెల్ ను తలకు పట్టిస్తే దురద, చుండ్రు చాలా ఈజీగా తగ్గుతాయి.అలాగే బేకింగ్ సోడా ఒక అద్భుతమైన ఎక్స్‌ఫోలియంట్. ఇది డెడ్ స్కిన్‌ని తొలగించి చుండ్రుని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. దీని కోసం మీరు మొదట మీ తలను బాగా శుభ్రంగా కడగాలి.ఇక ఆ తర్వాత బేకింగ్ సోడాను నేరుగా తలకు పట్టించాలి. ఆ తర్వాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి.చుండ్రుని ఈజీగా తగ్గించే మరో చిట్కా ఆపిల్ సైడర్ వెనిగర్.


ఎందుకంటే ఇందులో చాలా యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌తో పోరాడటానికి చాలా బాగా సహాయపడతాయి. ఒక గిన్నెలో సమాన పరిమాణంలో నీరు ఇంకా ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపండి.దీన్ని మీ తలకు స్మూత్‌గా అప్లై చేయండి. ఒక 15-20 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. ఇక మంచి ఫలితాల కోసం వారానికి 2-3 సార్లు ఇలా చేయండి.చుండ్రును వదిలించుకోవడానికి మరొక గొప్ప మార్గం ఏంటంటే కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అనేది సహజ మాయిశ్చరైజర్. ఇది ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనెను వేడి చేసి తలకు బాగా పట్టించి మసాజ్ చేయండి. దీన్ని రాత్రంతా తలపై పెట్టుకోవడం మంచిది. పొద్దున్నే స్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: