మన శరీరంలో విటమిన్స్ లోపించడం వల్ల చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది.మన చర్మం కళను కోల్పోయినట్టుగా కనబడుతుంది.అనేక చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి మన శరీరంలో విటమిన్స్ లోపం లేకుండా చూసుకోవాలి. శరీరంలో ఏయే విటమిన్స్ లోపించడం వల్ల ఎలాంటి చర్మ సమస్యలు వస్తాయో ఇంకా చర్మ ఆరోగ్యానికి ఏయే విటమిన్లు చాలా అవసరమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన శరీరంలో విటమిన్ ఇ లోపించడం వల్ల చర్మం పొడిబారడుతుంది. చర్మం చాలా నీరసంగా కనిపిస్తుంది.అలాగే చర్మంలో తగినంత తేమ ఉండదు. కాబట్టి చర్మ ఆరోగ్యానికి విటమిన్ ఇ ఎంతో అవసరం. శరీరానికి తగినంత విటమిన్ ఇని అందించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పైగా వాతావరణ కాలుష్యం కారణంగా కూడా చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. చర్మం  ఛాయ పెరుగుతుంది.ఇంకా ఫ్రీరాడికల్స్ కారణంగా చర్మానికి నష్టం కలగకుండా ఉంటుంది. చర్మం చాలా ఆరోగ్యవంతంగా తయారవుతుంది.ఇంకా విటమిన్ డి లోపించడం వల్ల కూడా చర్మ సమస్యలు తలెత్తుతాయి.ఈ విటమిన్ డి లోపించడం వల్ల చర్మం తరుచూ ఇన్పెక్షన్ ల బారిన పడుతుంది.


 తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చర్మం బాగా పొడిబారుతుంది. కాబట్టి విటమిన్ డి లోపం తలెత్తకుండా చూసుకోవాలి. తగినంత విటమిన్ డి ని అందించడం వల్ల చర్మం  రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఇంకా చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే వ్యాధి కారక క్రిముల నుండి చర్మానికి హాని కలగకుండా ఉంటుంది.ఇంకా అలాగే చర్మ ఆరోగ్యానికి విటమిన్ సి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి హాని కలగకుండా కాపాడుతుంది. తగినంత విటమిన్ సి అందించడం వల్ల చర్మం చాలా యవ్వనంగా ఉంటుంది.అలాగే ముడతలు పడకుండా ఉంటుంది. ఇక చర్మ ఆరోగ్యానికి బి విటమిన్స్ కూడా ఖచ్చితంగా చాలా అవసరం. ఎందుకంటే బి విటమిన్స్ లోపించడం వల్ల చర్మం పొడిగా మారుతుంది.ఇంకా పెదాలు పలుగుతాయి. చర్మంపై ముడతలు, మచ్చలు ఇంకా దద్దుర్లు వంటివి వస్తాయి.కాబట్టి చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తగినన్ని బి విటమిన్స్ ఉండడం  చాలా అవసరం. బి విటమిన్స్ లో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ ప్లామేషన్ ను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: