ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్య వస్తుంది. ఈ తెల్లజుట్టు సమస్య రాగానే చాలా మంది కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ లని వాడేస్తూ ఉంటారు.వాటి వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకున్న చిట్కా ఫాలో అయితే తెల్ల జుట్టు సమస్య నుంచి ఈజీగా బయటపడటమే కాకుండా జుట్టు రాలే సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.ఇప్పుడు చెప్పే రెమిడి పాటిస్తే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఒక ఉల్లిపాయ తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని మిక్సీ జార్లో వేయాలి. ఇక ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కను శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేయాలి.ఆ తర్వాత గుప్పెడు కరివేపాకు వేసి అరకప్పు నీటిని పోసి దానిని మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి.


తరువాత ఈ పేస్ట్ నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేయాలి. ఆ తరువాత ఈ జ్యూస్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ జ్యూస్ ని ఒక స్ప్రే బాటిల్లో నింపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల దాకా బాగా పట్టించాలి.ఇక ఒక గంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు సమస్య, జుట్టు రాలే సమస్య ఇంకా చుండ్రు సమస్య వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. మీరు కాస్త ఓపికగా చేసుకుంటే మంచి పలితాన్ని పొందవచ్చు. ఇంకా ఈ విధంగా చేయటం వలన తెల్ల జుట్టు రావటం కూడా చాలా ఆలస్యం అవుతుంది.కరివేపాకు,అల్లం,ఉల్లిపాయ ఇంకా కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్ళకు బలాన్ని అందిస్తాయి.ఇంకా అలాగే జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పని చేస్తాయి. కాబట్టి ఈ టిప్ ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. ఈ టిప్ లో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులభంగానే లభ్యం అవుతాయి.కాబట్టి ఖచ్చితంగా పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: