బ్లాక్ హెడ్స్ అనేవి చాలా మందికి కూడా తలనొప్పిగా మారతాయి. చాలా మందికి ముఖంపై అక్కడక్కడా బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ చాలా మందికి కూడా ముక్కుపై మాత్రమే చాలా ఎక్కువగా ఎక్కువగా వస్తాయి.పైగా వాటిని చాలా మంది వాటిని గిల్లుతూ ఉంటారు. చర్మంపై మురికి, మృత కణాలు బాగా పేరుకు పోవడం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ బ్లాక్ హెడ్స్ అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. వీటిని తొలగించుకోవడానికి చాలా మంది బ్యూటీ పార్లర్స్‌కి వెళ్తే.. ఇంకొంత మంది మార్కెట్లో దొరికే ప్రోడెక్ట్స్‌ని ఉపయోగిస్తారు. వీటి వలన చర్మానికి కూడా చాలా నష్టం కలగవచ్చు. వీటివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే వీటికి బదులు ఇంట్లోనే కొన్ని నేచురల్ టిప్స్ ఉపయోగిస్తే ఈజీగా ఈ సమస్య తగ్గిపోతుంది. అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకొని వాటిని పాటిద్దాం.


ఒక గిన్నెలోకి కొద్దిగా దాల్చిన చెక్క పొడి, కొద్దిగా తేనె వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం లేదా బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే సరిపోతుంది. పది నిమిషాల తర్వాత కాటన్ సహాయంతో తుడిచేయండి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖం కడిగేసుకోండి. ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్ త్వరగా పోతాయి.అలాగే బాగా పండిన టమాటా తీసుకోండి. ఇది గ్రైండ్ చేసి.. ఆ పేస్ట్‌ని ముఖం అంతా పట్టించండి. ఆ తర్వాత సున్నితంగా మర్దనా చేయండి. ఆ తర్వాత ఓ 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేస్తే సరి. ఇలా చేయడం వల్ల బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ పోవడమే కాకుండా.. ముఖం కూడా కాంతి వంతంగా మారుతుంది.అలాగే కోడిగుడ్డులోని తెల్ల సొనతో కూడా బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకోవచ్చు. గుడ్డులోని తెల్ల సొనను తీసుకుని.. ముఖానికి పట్టించండి. ఇది బాగా ఆరిన తర్వాత.. గుడ్డులోని తెల్లసొనను మళ్లీ రెండోసారి అప్లై చేయాలి. ఇప్పుడు ఓ 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా తరచూ చేస్తే.. మృతకణాలు కూడా తగ్గుతాయి.కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన టిప్స్ పాటించండి. బ్లాక్ హెడ్స్ సమస్య చాలా ఈజీగా తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: