సరిలేరు నీకెవ్వరూ తర్వాత స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తాడనుకున్న మహేష్ బాబు మళ్ళీ ఓ మీడియం డైరెక్టర్ తోనే ముందుకు వెళ్ళాడు.. అయన 'సర్కార్ వారి పాట' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం లాంటి క్లాసిక్ హిట్ కొట్టిన పరశురామ్ ఈ సినిమా కి దర్శకుడు.  సుకుమార్ ని కాదని మరీ చేస్తున్న ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని మహేష్ బాబు కూడా సినిమా పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడట.. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది..