ఒక్క ఓటమి, ఒక్క ఎన్నికలో వెనుకబాటు తనం తెలంగాణ లో కేసీఆర్ పరిస్థితి, పార్టీ పరిస్థితి కొంత అయోమయం చేసింది దుబ్బాక లో ఓటమి, గ్రేటర్ ఎన్నికల్లో అనుకున్న సీట్లు రాకపోవడంతో టీ ఆర్ ఎస్ కి ఇప్పుడు పరిస్థితి పూర్తి ప్రతికూలంగా మారిపోయింది. బీజేపీ పార్టీ కి కొంత బలం పుంజుకుందో లేదో కానీ గెలిచేసినంత ఫీల్ అయితే వారిలో వుంది.. నిజానికి తెరాస  ప్రజల తిరుగుబాటు తో ఇప్పుడు ఏం చేయాలో తెలీని పరిస్థితి ఏర్పడింది.. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజలు వ్యతిరేకమవడం వారిని కలవర పెడుతున్నా ముందు ముందే ఎలాంటి కార్యకలాపాలు చేయాలో చూసుకుంటున్నారు.