కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పట్టణ పేదలు, వలస కార్మికుల కోసం స్వల్ప అద్దె గృహాల నిర్మాణానికి కొత్త పథకం తీసుకొస్తున్నామని అన్నారు. పేదలు, వలస కూలీలకు అందుబాటులో ఉండేలా పీపీపీ పద్ధతిలో గృహాల నిర్మాణం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని చేపడితే కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. వలస కార్మికుల నివాసానికి ఇబ్బంది లేకుండా ఈ పథకం ఉంటుందని చెప్పారు. 
 
 
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ పథకాన్ని తీసుకొస్తామని అన్నారు. భూమి ఉన్నవాళ్లు ఎవరైనా ముందుకొస్తే కేంద్రం తగిన ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. సహకార బ్యాంకుల ద్వారా రైతులకు 3,000 కోట రూపాయల రుణాలను ఇవ్వనున్నట్టు తెలిపారు. ముద్ర పథకం కింద 50,000 రూపాయల లోపు లోన్ తీసుకున్నవారికి వడ్డీ రాయితీ ఇస్తామని ప్రకటన చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: