జమ్ము కశ్మీర్
క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) కుంభకోణంలో
ఎంపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఛైర్పర్సన్ ఫరూఖ్ అబ్దుల్లాను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ప్రశ్నించింది.అధికారిక వర్గాల ప్రకారం..
ఫరూఖ్ అబ్దుల్లా జేకేసీఏ ఛైర్మన్గా ఉన్నప్పుడు రూ.43 కోట్లు దుర్వినియోగమైన విషయంపై ఆయన్ను ప్రశ్నించినట్లు తెలిసింది. బ్యాంకు దస్త్రాల ఆధారంగా విచారణ సాగినట్లు సమాచారం.
ఇంతకు ముందు ఇదే విషయంలో.. 2019లోనూ ఈడీ ఆయన్ను విచారించింది.ఈ విషయంపై నేషనల్ కాన్ఫరెన్స్ త్వరలోనే స్పందిస్తుందని ఫరూఖ్ అబ్దుల్లా.. కుమారుడు
ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇటీవల ‘పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్’ ఏర్పడిన నేపథ్యంలో.. తాజా పరిణామం రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు ఒమర్.