విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు సంబందించి ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై మాట్లాడేందుకు త‌న‌కు అనుమ‌తివ్వాల‌ని కోరుతూ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి లేఖ రాశారు. విశాఖ‌ప‌ట్నం ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ లోక్‌స‌భ‌లో విశాఖ ఉక్కుకు సంబంధించి అడిగిన ప్ర‌శ్న‌కు ముందుకు వెళుతున్నామంటూ నిర్మ‌ల స‌మాధాన‌మిచ్చింది. దీనిపై విశాఖ‌ప‌ట్నం ఒక్క‌సారిగా భ‌గ్గుమంది. కార్మికులు, నిర్వాసితులు న‌గ‌రంలో ఆందోళ‌న బాట ప‌ట్టారు. కార్మికులంతా మాన‌వ‌హారంతో జాతీయ ర‌హ‌దారిని నిర్బంధించారు. 100 శాతం పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించే నిర్ణ‌యాన్ని పునఃప‌రిశీలించాలంటూ జ‌గ‌న్ త‌న లేఖ‌లో ప్ర‌ధానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఆర్ ఐఎన్ ఎల్‌ను లాభాల‌బాట ప‌ట్టించేందుకు ఉక్కుశాఖ మంత్రికి సూచ‌న‌లిచ్చాన‌ని తెలిపారు. ఉప‌యోగించ‌మ‌ని భూమి 7వేల ఎక‌రాలుంద‌ని, వాటిని ప్లాట్ల కింద మార్చి ఆర్ ఐఎన్ ఎల్‌ను ఆర్థికంగా బ‌ల‌ప‌ర‌చ‌వ‌చ్చ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: