ఏపీలో టీడీపీకి ఆధిక్య‌త వ‌చ్చిన మున్సిపాల్టీలు రెండే రెండు. ఆ రెండు మున్సిపాల్టీలు అయిన తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీలను కూడా తామే కైవసం చేసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆ రెండుచోట్ల ఎక్స్ అఫిషియో సభ్యుల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుంటామన్నారు. ఈ రెండు మున్సిపాల్టీల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వీరితో అక్క‌డ అధికారం ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని వైసీపీ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 90 శాతం విజయం సాధిస్తే, జగన్ హయాంలో వంద శాతం ఫలితాలను సాధించామని బొత్స సత్యానార‍యణ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: