దేశ వ్యాప్తంగా స‌మ్మ‌ర్ మంట హీటెక్కిపోతోంది. ఈ క్ర‌మంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉష్ణోగ్ర‌త‌లు 40 నుంచి 45 సెల్సియ‌స్ డిగ్రీల మ‌ధ్య‌లో న‌మోదు అవుతున్నాయి. బ‌య‌ట‌కు వ‌స్తే మండిపోతోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ వాతావ‌ర‌ణ శాఖ ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వ‌ర‌కు ఎండ‌లు తీవ్రంగా ఉంటాయ‌ని.. ప్ర‌జ‌లు ఎంతో అవ‌స‌రం అయితే త‌ప్పా బ‌య‌ట‌కు రావొద్ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ముఖ్యంగా 4వ తేదీ నుంచి 6వ తేదీ వ‌ర‌కు 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

ఈ మూడు రోజులు తెలంగాణ‌కు మహారాష్ట్రలోని విదర్భ నుంచి వడగాడ్పులు వీస్తాయని, దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతాయని వివరించింది. ఆదివారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంక ర్‌ భూపాలపల్లి, ములుగు. భ ద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని పేర్కొంది. క‌నీసం ప్ర‌జ‌లు మ‌ధ్యాహ్నం 11 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని పేర్కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: