సీరం సంస్థ తన వ్యాక్సిన్ డోస్ ధరను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్క డోసు ధర రూ.400 గా ప్రైవేట్ కు రూ.600 గా నిర్ణయించింది. అయితే,కోవిషీల్డ్ డోసులకు సంబంధించి రాష్ట్రాలకు అధిక ధరలను నిర్ణయించడాన్నికాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తప్పుపట్టాయి. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒకే ధర ఉండాలని డిమాండ్ చేశాయి.  సీరం కంపెనీ ఈ ధరలను ప్రకటించగానే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసారు. ట్విట్టర్ వేదికగా ఆయన మోదీ ప్రభుత్వం పై మండిపడ్డారు.అంతేకాకుండా.. ఇది ప్రధాని మోదీ మిత్రులకు లభించిన అవకాశమని, కేంద్ర  ప్రభుత్వానికి జరిగిన అన్యాయమని ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతాలో.."आपदा देश की अवसर मोदी मित्रों का अन्याय केंद्र सरकार का!" అని ట్వీట్ పోస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: