దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. రోజుకు లక్షల్లో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే ఆయా రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత వేదిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, డిల్లీ వంటి రాష్ట్రాలలో ఈ సమస్య మరి ఎక్కువగా ఉంది. తాజాగా డిల్లీ ప్రభుత్వానికి హైకోర్ట్ మొట్టికాయలు వేసింది. గత ఆరు నెలలుగా వెంటిలేటర్లు సమకూర్చడంలో డిల్లీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని దర్మాసనం వ్యాఖ్యానించింది. కోవిడ్ ను కట్టడి చెయ్యడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైకరికి దర్మాసనం మండి పడింది.   .

మరింత సమాచారం తెలుసుకోండి: