ప్రముఖ దర్శక నిర్మాత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు మొరళీమోహన్ కోడలు, విశ్వేశరరావు మనవరాలు అయిన మాగంటి రూప సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. " మీరు పరిచయం చేసిన ప్రతి పుస్తకం గుర్తుంది. మీరు నా చేయి పట్టుకొని తీసుకెళ్లిన ప్రపంచ సినిమా పండుగలన్నీ కళ్లముందు కదలాడుతున్నాయి. 

కమ్యునిస్టు భావలతో  సినిమారంగంలోకి అడుగుపెట్టారు. కంచుకోట, తీర్పు, మార్పు, పెత్తందార్లు లాంటి ఎన్నో మంచి సినిమాల నిర్మాతగా కీర్తి గడించారు. తెలుగువాళ్లందరూ ఒక తాటిమీద వుండాలని ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. చివరి క్షణం వరకూ మీ మంచి చెడ్డలు మీరే చూసుకోడానికి ఇష్టపడ్డారు. విశ్వశాంతి విశ్వేశ్వర్రావ్ గారి మనవరాళ్లమని గర్వపడేలా చేశారు. మహాభారతం లాంటి  మీ సుదీర్ఘ జీవితం ముగించి మహాప్రస్ధానానికి పయనమయ్యారు. తాతగారూ మీకు శతకోటి వందనాలు." అంటూ మాగంటి రూప ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: