జమ్మూ కాశ్మీర్ లో వరుస ఎన్ కౌంటర్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు, ఇద్దరు భారతదేశ భద్రతా బలగాలకు చెందిన వారు వీరమరణం పొందారు.. ఇక చనిపోయిన టెర్రరిస్టుల ముగ్గురు నిషేధిత లష్కరే తోయిబా సంస్థకు చెందిన వారని అధికారులు గుర్తించారు. 

నిజానికి హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ burhan wani ఐదో వర్ధంతి సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో జనం బంద్ పాటించారు. ఈ క్రమంలో పుల్వామా జిల్లాలో టెర్రరిస్టుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది కూంబింగ్ మొదలుపెట్టారు. భద్రతా సిబ్బంది రాకను గమనించిన టెర్రరిస్టులు వారిపై కాల్పులు జరపగా ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఇక చనిపోయిన భద్రతా బలగాలలో ఒక జవాన్ ఆంధ్రప్రదేశ్ బాపట్లకు చెందిన వ్యక్తికాగా అలాగే కేరళకు చెందిన శ్రీజిత్ అనే జవాను కూడా మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: