మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తి చేసుకోగా కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్ రౌండ్ బిగిన్స్ అంటూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. దాంతో ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు అర్థమవుతోంది. 

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి కిరణ్ కొరపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబి, సిద్ధూ బుద్ధ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ ఇప్పటివరకు కనిపించని రోల్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో కొంత కాలంగా  వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం జిమ్ లో కష్టపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: