ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రోర్ ని కాసేపటి క్రితం చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ పేర్లతో హీరోల పాత్రలను డిజైన్ చేసిన రాజమౌళి... ఈ రోర్ లో మాత్రం సినిమా మేకింగ్ ని క్లియర్ గా చూపించారు.

అడవుల్లో యాక్షన్ సన్నివేశాలను చూపించారు. అలాగే బ్రిటీష్ సైనికుల తీరు, బ్రిటీష్ సైన్యాదికారులను, అలియా భట్, శ్రేయ, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా ప్రతీ ఒక్కరి చూపించారు. ఎక్కువగా అడవుల్లో కార్చిచ్చు  పెట్టినట్టు కొన్ని సన్నివేశాలను చూపించడమే కాకుండా ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న దృశ్యాలను కూడా పొందుపరిచారు. మణిశర్మ సహా పలువురు ప్రముఖులు ఈ సినిమా కోసం పని చేస్తున్న దృశ్యాలను పొందుపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr