ఆఫ్ఘనిస్తాన్‌లో ఇండియన్ ఫోటో జర్నలిస్ట్ హత్యకు గురైయ్యాడు. కందహార్ నగరంలోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో శుక్రవారం ఆఫ్ఘన్ భద్రతా దళాలు,తాళిబన్‌లకు మధ్య ఘర్షణలు జరిగాయి.దీనిని కవర్ చేస్తున్న భారత ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీని హత్య చేశారు.డానిష్ సిద్ధిఖీ హత్యను భారత ఆఫ్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మముండ్జాయ్ ఖండిచారు.ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు.నిన్న రాత్రి కందహార్లో డానిష్ సద్ధిఖీ అనే స్నేహితుడిని
హత్య చేసిన విషాద వార్త తీవ్ర మనస్తాపానికి గురైయ్యానని ఆయన ట్వీట్ చేశారు. పులిట్జర్
బహుమతి గ్రహీత ఫోటో జర్నలిస్ట్ అయిన డానిష్
సిద్దిఖీ టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. తరువాత ఫోటో జర్నలిజానికి మారారు.
అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌తో ఫోటో జర్నలిస్ట్‌గా పనిచేసిన ఆయన
ఇండియా టుడే గ్రూప్‌లో
సెప్టెంబర్ 2008 నుండి
జనవరి 2010 వరకు కరస్పాండెంట్‌గా పనిచేశారు.రాయిటర్స్ బృందంలో భాగంగా రోహింగ్యా రెఫ్యూజీ సంక్షోభాన్ని డాక్యుమెంట్ చేసినందుకు 2018 లో, డానిష్
సిద్దిఖీ మరియు అతని సహోద్యోగి అద్నాన్ అబిడి ఫీచర్ ఫోటోగ్రఫీకి పులిట్జర్ బహుమతిని గెలుచుకున్నారు.