భారతదేశంలో టీకాలు తీసుకున్న తర్వాత నమోదవుతున్న ప్రతికూల సంఘటనలకు కారణం ఆందోళన అని ప్రభుత్వ నివేదిక ఒకటి వెల్లడించింది. టీకా తీసుకున్న తర్వాత వస్తున్న దుష్పరిణామాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 88 కేసులను అధ్యయనం చేసిన ఈ కమిటీ అందుకు కారణాలేంటనే విషయాన్ని వెల్లడించింది. టీకా తీసుకునేటప్పుడు సూది అంటే ఉండే భయంవల్ల పురుషులకంటే మహిళలే ఎక్కువ ఆందోళనకు గురవుతున్నట్లు తేలింది. మొత్తం 88 కేసుల్లో 22 కేసులు ఆందోళనకు సంబంధించినవేనని, ఈ 22లో 16 కేసులు కొవిషీల్డ్ టీకాలు తీసుకున్న తర్వాత అని, మిగిలినవి కొవాగ్జిన్ తీసుకున్న తర్వాత తలెత్తినవని కమిటీ నివేదించింది. ఇవన్నీ ఆందోళనకు సంబంధించినవేనని, టీకా తీసుకుంటే శారీరక రుగ్మత కలుగుతుందని, కండరాలు బలహీనపడతాయని, లేదంటే ఇంకేదైనా సమస్యలు వస్తాయేమోననే మానసిక ఆందోళనే వారిని బలహీనపరిచిందని, అలాగే టీకా తీసుకున్న తర్వాత బలహీనంగా మారతారంటూ వస్తున్న పుకార్లు కూడా వీరిలో ఆందోళన రేకెత్తించడానికి కారణమయ్యాయని కమిటీ నివేదించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి