ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాలుస్తోంది. కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం భారీగా పెరిగింది. కర్ణాటక, తెలంగాణ, ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా, తుంగభద్ర నదుల్లో  వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో కృష్ణా పరీవాహక ప్రాంతంలోని జలాశయాలు నిండుకుండల్లా మారిపోయాయి. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి.

జూరాల, తుంగభద్ర జలాశయాలకు పూర్తిగా జలకళ వచ్చింది. దీంతో రేపు తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తేయాలని అధికారులు నిర్ణయించారు. అందుకే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తుంగభద్ర ఇంజినీర్లు జారీ చేశారు. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కర్నాటక, తెలంగాణ, ఏపీ అధికారులను అధికారులు అప్రమత్తం చేశారు.ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ఈ సారి శ్రీశైలం ప్రాజెక్టు కూడా త్వరగానే నిండే అవకాశం కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: