మూడు నెలల బాబుకు ఆరోగ్యం విషమించింది. దాంతో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి మరింత విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. దాంతో తల్లి ఎంతో ఆందోళన చెందింది. అయితే అదే సమయంలో అంబులెన్స్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఆ బిడ్డకు మళ్ళీ ప్రాణం పోసారు. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా కు చెందిన సుజాత అనే మహిళకు మూడు నెలల క్రితం మగ బిడ్డ పుట్టాడు. అయితే ఆ బాబుకు అనారోగ్య సమస్య రావడంతో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

కాగా బాబు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దాంతో వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సలహా ఇవ్వగా అంబులెన్స్ లో వరంగల్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే మార్గమధ్యంలో బాబు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. దాంతో అంబులెన్స్ సిబ్బంది హార్ట్ బీట్ కంప్రెషన్ ద్వారా మళ్ళీ ఆ బాలుని గుండె కొట్టుకునేలా చేశారు. అలా ఆగిన గుండె కు అంబులెన్స్ సిబ్బంది ప్రాణం పోయడంతో ప్రస్తుతం ఆ బాలుడు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంబులెన్స్ సిబ్బంది బిడ్డను బతికించిన తీరుపై వైద్యులు ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: