కరోనా సెకండ్ వెవ్ భారత దేశాన్ని ఒక పట్టాన వదలడం లేదు. మరోవైపు మూడో వెవ్ ముంచుకోస్తుంది అంటూ అటు నిపుణులు, ఇటు మీడియా కోడై కూస్తున్నారు. కానీ సెకండ్ వెవ్ లో భారత్ కుదేలైన తర్వాత కరోనా నియంత్రణ చర్యలు కట్టు దిట్టగానే కొనసాగుతున్నాయి. ఇక కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోవిడ్ -19 కి సంబందించిన మార్గదర్శకాలు ఈ రోజు తాజాగా మరోమారు విడుదల చేసింది. ఈ కరోనా గైడ్ లైన్స్ ని ఆగస్టు 31 వరకు పొడిగించింది . అంతే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ, జిల్లాల్లో ఈ గైడ్ లైన్స్ ని కఠినంగా అమలు చేయాలనీ రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కోవిడ్ -19 కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను పాటించడంలో "ఎలాంటి అలసత్వం పనికి రాదు అని కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు మరియు యుటిలకు లేఖ రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: