టోక్యో ఒలింపిక్స్ లో 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగం లో భారత దేశానికి సిల్వర్ మెడల్ అందించిన మీరా భాయ్ పైన యావత్ దేశం నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ క్రమం లో మీరాబాయి చానుకి మరో బంపర్ ఆఫర్ దక్కింది. ఐనాక్స్ మ‌ల్టీప్లెక్స్ చాను కు జీవితకాలం పాటు సినిమా టికెట్లు ఉచితంగా అందిస్తామంటూ ఆ కంపెనీ ప్రకటించింది. కేవలం మీరాబాయి కి మాత్రమే కాదు భారత్ తరఫున పథకం గెలిచిన అందరు అథ్లెట్స్ కి ఈ ఆఫర్ వర్తిస్తుంది ఆ కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని తమ అధికారిక ద్వారా ఐనాక్స్ మ‌ల్టీప్లెక్స్ కంపెనీ పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక ఐనాక్స్ మ‌ల్టీప్లెక్స్ కి దేశం మొత్తం మీదుగా 648 మల్టీప్లెక్స్ లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: