స్టేట్ అండ్ ప్రూవ్ : సీమ‌కో శుభ‌వార్త చెప్పిన బొత్స

విశాఖ ప్లాంటు
తిరుప‌తి అభివృద్ధి
జ‌ల‌వివాదాలు
చెత్త  ప‌న్ను
ఈ నాల్గింటిపై బొత్స క్లారిఫికేష‌న్
ఆ వివ‌రం ఈ సంక్షిప్త వార్త‌లో...

రాయలసీమజిల్లాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం అని మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స తెలిపారు. చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించి,తిరుప‌తి అభివృద్ధి ప‌నులు సంతృప్తిక‌రంగా ఉన్నాయన్నారు.

అదేవిధంగా చెత్త ప‌న్నుపై స్పందిస్తూ..ఈ విధానం ప‌క్క రాష్ట్రాల్లోనూ ఉంద‌న్నారు.అమ‌ర్ రాజా బ్యాట‌రీ కంపెనీ త‌రలింపు విష‌య మై ప్ర‌భుత్వం ఒత్తిడి ఏమీ లేద‌ని స్ప‌ష్టంచేశారు.రాజ‌ధాని మార్పు ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని మ‌రో సారి చెప్పారు. జ‌ల వివాదాల పై కూడా స్పందిస్తూ తాము తెలంగాణ‌తో గొడ‌వ‌లు కోరుకోవ‌డం లేద‌ని పునఃస్ప‌ష్ట‌త ఒక‌టి ఇచ్చారు.అదే సంద‌ర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూడా త‌న దైన క్లారిటీ ఇచ్చారు. కేంద్రం విధానాల‌ను తూర్పారపట్టారు. మొత్తానికి కేంద్రంతో వైసీపీ త‌గువు పెట్టుకు న్నా, పెట్టుకోక‌పోయినా ప్ర‌జ‌ల ముందు మాత్రం పెద‌వి విరుపులు మాత్రం నాయ‌కుల‌కు త‌ప్ప‌డం లేద‌న్న‌ది ఓ స్ప‌ష్టం అయిన సంకేతం అని తేల్చేయి బొత్స స్టేట్మెంట్ ను విన్న టీడీపీ వ‌ర్గాలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: