నేడు వైఎస్ ష‌ర్మిల మ‌హ‌బూబాబాద్ లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌హబూబ్ న‌గ‌ర్ గూడూరు మండలం గుండెంగలో వైఎస్ షర్మిల ఈరోజు ఏర్పాటు చేసిన‌ దీక్ష ముగిసింది. కాగా దీక్ష‌లో షర్మిల కేసీఆర్ ప్ర‌భుత్వం పై సీఎం పై సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. నిరుద్యోగుల హంతకుడు సీఎం కేసీఆర్ అంటూ ష‌ర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిరుద్యోగులు చనిపోవడం కాదు...కేసీఆర్ అహంకారాన్ని చంపుదామని ష‌ర్మిల పిలుపునిచ్చారు. కేసీఆర్ కు పాలనచేయడం చేతకాకపోతే మత్తులో పడుకోవాల‌ని ష‌ర్మిల హిత‌వుప‌లికారు. 

5, 6 వ త‌ర‌గ‌తి చదివిన వాళ్లు మంత్రులవుతారట.. డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్లు ఆత్మహత్యలు చేసుకోవాలట అంటూ ష‌ర్మిల టీఆర్ఎస్ మంత్రుల‌ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇక ఈ రోజు రాత్రికి మహబూబాబాద్ లో ష‌ర్మిల బస చేయనున్నార‌ని స‌మాచారం. అంతే కాకుండా  రేపు ములుగు జిల్లాలో పోడు యాత్రలో షర్మిల పాల్గొని పోడు భూముల రైతుల‌కోసం కొట్లాడ‌బోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: