టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ట్రైలర్ ను ఈ రోజు మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ట్రైలర్ చాలా బాగుందని పేర్కొన్నారు. పలాస దర్శకుడు తరుణ్ కుమార్ దర్శకత్వం వచించిన ఈ సినిమా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒక ఊరిలో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. యూత్ ను ఆకట్టుకునే ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. 

ప్రేమకు పెళ్ళికి మధ్య కులాలు అడ్డు రావడం ఆ తర్వాత జరిగే పరిణామాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. గోదావరి జిల్లాలలో మంచి లొకేషన్స్ లో సినిమా షూటింగ్ జరిగినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా ఎయిట్ ప్యాక్ బాడీతో హీరో లుక్ మరియు పల్లెటూరి అమ్మాయిలా హీరోయిన్ లుక్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 27వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. మరి శ్రీదేవి సోడా సెంటర్ థియేటర్లలో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: