ఏపీలోని ప్ర‌కాశం జిల్లాలో కరోనా క‌ల‌వ‌రం రేకెత్తిస్తోంది. పాఠ‌శాల‌లు పునఃప్రారంభ‌మైన త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు 76 మంది కొవిడ్ బారిన ప‌డ్డారు. వీరిలో 28 మంది విద్యార్థులుకాగా, 48 మంది ఉపాధ్యాయులున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా పాఠ‌శాల‌లు ప్రారంభ‌మైన త‌ర్వాత కొవిడ్ కేసులు ఎక్కువ‌వుతుండ‌టంతో ఉపాధ్యాయుల‌తోపాటు విద్యార్థుల త‌ల్లిదండ్రులు కూడా భ‌య‌ప‌డుతున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో రోజురోజుకూ కేసులు ఉధృతంగా పెరుగుతుండ‌టంపై కూడా వైద్య‌నిపుణులు ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నారు. ఇది మ‌రింత ఉధృత‌మై మూడోద‌శ‌కు దారితీసే ప్ర‌మాదం ఉంటుంద‌ని, సాధ్య‌మైంత‌వ‌ర‌కు పాఠ‌శాల‌ల‌కు మ‌రికొన్ని రోజుల సెల‌వుదినాలు ప్ర‌క‌టిస్తే బాగుంటుంద‌ని సూచిస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఒక్క ప్ర‌కాశం జిల్లాలోని పాఠ‌శాల‌ల్లోనే కేసులు పెరుగుతున్నాయి. ఒంగోలు, కందుకూరు, టంగుటూరు త‌దిత‌ర ప్రాంతాల్లో విద్యార్థులు క‌రోనా బారిన ప‌డ్డారు. జ్వ‌ర‌ల‌క్ష‌ణాలుంటే విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించ‌కుండా వెంట‌నే ఇంటికి పంపించివేస్తున్నారు. క‌రోనా ప‌రీక్ష‌ల‌పై పాఠ‌శాల్లో ప్ర‌త్యేక డ్రైవ్‌లు నిర్వ‌హించాల‌ని వైద్యాధికారులు యోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: