ఈ రోజు టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ అద్భుతంగా రాణిస్తోంది అనే చెప్పాలి. ముందుగ షూటింగ్లో అవని లేఖర బంగారు పతకం తర్వాత, యోగేష్ కథునియా ఇప్పుడు పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56 ఈవెంట్లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించారు. టోక్యో పారాలింపిక్స్‌లో 44.43 మీటర్ల దూరం డిస్కస్ విసిరిన కథునియా భారతదేశానికి నాలుగో పతకాన్ని అందించారు. యోగేష్ కథునియా హర్యానాలోని బహదూర్‌గఢ్‌కు చెందినవాడు. ఇక ఈ విజయం తరువాత, అతని ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఈరోజు రెండు పతకాలు సాధించడానికి ముందు, భారత అథ్లెట్లు నిన్న రెండు రజత పతకాలు సాధించారు. భారతదేశానికి చెందిన మరో పారా అథ్లెట్ వినోద్ కుమార్ కూడా నిన్న F52 డిస్క్ త్రో విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు, కానీ అతని ఫలితం మీద సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి