ఏపీలోని ముసునూరు మండ‌లం జిల్లా పరిష‌త్ పాఠ‌శాల‌లో ఐదుగురు విద్యార్థుల‌కు మ‌రియు సైన్స్ అసిస్టెంట్ కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. అంతే కాకుండా అదే పాఠ‌శాల‌లో ఆరో తరగతి ఒకరు, ఎనిమిదో తరగతి ఇద్దరు, పదో తరగతిలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది.
క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన విద్యార్థులందరూ ముసునూరుకు చెందినవారిగా స‌మాచారం. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స కోసం అధికారులు మెడికల్ కిట్లను అంద‌జేశారు.


అంతే కాకుండా క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ప్ర‌భుత్వ వైద్యులు విద్యార్థులను హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు. అదే విధంగా పాఠశాల మొత్తం శానిటైజ్ చేసి మిగతా విద్యార్థులకు కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తామ‌ని పాఠ‌శాల‌ ప్రధానోపాధ్యాయులు వెల్ల‌డించారు. మ‌రోవైపు కరోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు ప్ర‌ధానోపాధ్యాయులు రెండు రోజులు సెలవులు ప్రకటించిన‌ట్టు ప్ర‌క‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: