ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపధ్యంలో కృష్ణా నదికి భారీగా వరదలు వస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ కు భారీగా వరద వస్తుంది. రెండు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ కు పెరిగిన వరద ఉధృతి... అధికారులను కంగారు పెడుతుంది. ప్రకాశం బ్యారేజ్ ఎగున భాగంలో ఉన్న వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి అని అధికారులు హెచ్చరించారు.

జిల్లాలోని రామిలేరు, తమిలేరు, వైరా, కీసర మునేరు కు భారీ గా వరద నీరు వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 65 వేల క్కుసేకులు ,ఔట్ ఫ్లో 57 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా తూర్పు,పశ్చిమ కాల్వల కు సాగు,త్రాగు నీటి అవసరాల కోసం 8 వేల క్కుసేకులు విడుదల చేసారు. ఈ రోజు సాయంత్రానికి లక్ష క్కుసేకులు నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు అలెర్ట్ గా ఉండాలని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap