క‌రోనాలో కొత్త‌గా వ‌స్తున్న ర‌కాలు గాలిద్వారా సుల‌భంగా వ్యాపించేలా రూపాంత‌రం చెందుతున్నాయ‌ని అమెరికాకు చెందిన శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. యూనివ‌ర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ కు చెందిన శాస్త్ర‌వేత్త‌లు ఈ ప‌రిశోధ‌న‌లో పాల్గొన్నారు. క‌రోనాలో ఆల్ఫా ర‌కం బారిన ప‌డిన‌వారు మిగ‌తార‌కాల బారిన‌ప‌డిన‌వారితో పోలిస్తే 100 శాతం వైర‌ల్ రేణువులు వెద‌జ‌ల్లుతార‌ని వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ముఖానికి స‌రిగ్గా అమ‌ర‌కుండా మాస్క్‌లు ధ‌రిస్తే వైర‌స్ వ్యాప్తి స‌గం మాత్ర‌మే త‌గ్గుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆల్ఫా ర‌కంతో పోలిస్తే డెల్టా వేరియంట్ ఉధృతంగా వ్యాప్తిచెందుతోంద‌న్నారు. కొత్త‌గా వ‌స్తున్న క‌రోనా ర‌కాలు గాల్లో వేగంగా వ్యాప్తిచెందే సామ‌ర్థ్యాన్ని మెరుగుప‌రుచుకుంటున్నాయ‌ని, దీనివ‌ల్ల గ‌దుల్లో వెంటిలేష‌న్ స‌రిగా ఉండేలా చూసుకోవాల‌ని చెబుతున్నారు. మాస్క్‌లు కూడా ముఖానికి స‌రిగ్గా అమ‌రేలా చూసుకోవాల‌ని, టీకాల‌ను వేయించుకుంటే వైర‌స్ నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చంటున్నారు. కొత్త‌ర‌కాల‌వ‌ల్ల బాధితుల శ‌రీరంలో వైర‌ల్ లోడు ఎక్కువ‌గా ఉంటోంద‌ని, గాల్లోకి సులువుగా వ్యాపించే సామ‌ర్థ్యం కూడా వాటివ‌ల్ల పెరుగుతోంద‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: