రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఎన్ఐఏ వ‌రస సోదాలు క‌ల‌క‌లం రేకెత్తిస్తున్నాయి. మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిప‌రులు, విప్త‌వ‌సంఘం నేత‌లు, ర‌చ‌యిత‌లు, మ‌హిళా సంఘాల నేత‌ల‌ ఇండ్ల‌లో వ‌రుస సోదాలు కొన‌సాగిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. తొలుత హైద‌రాబాద్ లోని నాగోల్ లో నివాసం ఉండే ర‌విశ‌ర్మ అనురాద ఇంట్లో సోదాలు నిర్వ‌హించారు.  ఆ త‌రువాత సుభాష్‌న‌గ‌ర్ నివాసం ఉండే అమ‌ర‌వీరుల బంధు మిత్రుల సంఘం నాయ‌కురాలు భ‌వాని ఇంట్లో, ఒంగోలు లోని  విప్ల‌వ నాయ‌కులు క‌ళ్యాణ్‌రావు నివాసంలో, వైజాగ్‌లో ఉన్న చైత‌న్య మ‌హిళా సంఘం నాయ‌కురాలు అన్న‌పూర్ణ‌ నివాసంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

విప్ల‌వ నాయ‌కులు  క‌ళ్యాణ్‌రావు మావోయిస్ట్ పార్టీ చ‌ర్చ‌ల ప్ర‌తినిధిగా గ‌తంలో కొన‌సాగారు. వీరంద‌రికీ మావోయిస్టు నేత‌ల‌తో గ‌ల సంబంధాల‌పై ఆరా తీస్తున్నారు అధికారులు. ఇటీవ‌ల ఆర్‌.కే. జీవిత చ‌రిత్ర‌పై పుస్త‌కం ప్ర‌చుర‌ణపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ సోదాల్లో ఎన్ఐఏ అధికారుల‌కు ఏమైనా ల‌భ్య‌మయ్యాయా..?  లేదా అనే విష‌యం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: