నలభై ఏళ్లుగా భారత సైన్యానికి ఎనలేని సేవ చేసి... నీలగిరి కనుమల్లో హెలికాఫ్టర్ ప్రమాదంలో నేలకొరిగిన త్రివిధ దళాధిపతి సిడిఎస్ బిపిన్ రావత్ మరణం యావత్ దేశానికి విషాద వార్తయింది. ఆయన కు మరణం ఎలా సంభవించింది అన్న విషయం పై అందరికీ అనుమానాలున్నాయి. ఇంతకీ రావత్ మృతి పై ఎవరు దర్యాప్తు చేస్తున్నారో తెలుసా ?
భారత్ దేశపు తొలి త్రివిధ దళాధిపతి  సిడిఎస్ బిపిన్ రావత్ మృతిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ ఉభయ సభలలో అధికారిక ప్రకటన చేశారు.  సభ రావత్ తో పాటు మృతి చెందిన సైనికులకు సంతాప సూచకంగా కొద్ది సేపు మౌనం పాటించింది.
హెలికాఫ్టర్ ప్రమాదం పై ఎయిర్ చీఫ్ మార్షల్  మానవీంద్ర సింగ్ నేతృత్వం లోని దర్యాప్తు బృందం  విచారణ జరుపుతుందని రాజ్ నాథ్ సింగ్ సభలో ప్రకటించారు. త్రివిధ దళాలు కూడా... అంటే వాయుసేవ, నావికాదళం, పదాతి దళం లు మూడూ దర్యాప్తు   చేపడతాయని ఆయన తెలిపారు. ఈ త్రివిధ దళాలు ఒకరితో మరోకరు సమన్యయంతో ఈ దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటికే ఒక బృందం తమిళనాడు లోని వెల్లింగ్టన్ లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజికి చేరుకుంది. మరో బృందం ఘటనా  స్థలం లో శోధన చోస్తోంది. ఈ ఘటనలో బ్రతికి బైటపడిన గ్రూప్ కెప్టన్ వరుణ్ సింగ్ వెల్లింగ్టన్ లోని సైనికాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి అత్యంత ప్రమాద కరంగా ఉంది. అతనిని బతికించేందుకు వైద్యులు తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అతను  స్పృహలోనికి వచ్చిన తరువాతనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలున్నాయని  సైనికాధికారులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: