
అదేవిధంగా ముంబయిలోని ధారావిలో టాంజానియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి నూతన వేరియంట్ సోకినట్టు నిర్ణారనైంది. అయితే తాజా కేసులతో మొత్తం మహారాష్ట్రలో ఇప్పటివరకు 17 కేసులు నమోదైనట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు పుణేలో ఒమిక్రాన్ సోకిన 7గురిలో 5గురు కోలుకున్నారని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాజాగా ప్రకటించారు. పింప్రి చించ్వాడా ప్రాంతంలో ఉన్న ఆరుగురిలో నలుగురు, పుణే నగరంలో ఓ వ్యక్తికి నెగిటివ్‌గా తేలినది. ఏడుగురి ఆరోగ్యం ప్రస్తుతం బాగున్నట్టు పవార్ వెల్లడించారు. మహారాష్ట్ర ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు ఉండగా.. శుక్రవారం ఒక్కరోజే ఏడుగురికి ఒమిక్రాన్ సోకడంతో దీంతో ప్రజలు కంగారు పడుతున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసులు తాజాగా 32 నిర్థారణయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో 17, రాజస్థాన్‌లో 9, గుజరాత్ 03, కర్నాటక 02, ఢిల్లీలో 01 ఒమిక్రాన్ కేసు నమోదైంది.