సంక్రాంతి పండుగ తొలిరోజు భోగి రోజు.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో లారీ బోల్తా పడిన ఘటనలు నలుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి గురైన లారీ చేపల లోడుతో వస్తున్నట్టు గుర్తించారు.


లారీ బోల్తాపడిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలవ్వగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా భావిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ అదుపుతప్పడం వల్ల లారీ బోల్తాపడిందని గాయపడిన వ్యక్తులు తెలిపారు. పండుగ వేళ ఈ ప్రమాదం జరగడంతో సంబంధీకుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.


అటు కడప జిల్లా రామాపురం మండలం బీసీ కాలనీ వద్ద టాటా సుమో బోల్తా పడన ఘటనలో  8 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.. కడప రిమ్స్‌కు బాధితులను తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: