ఏపీ సీఎం జగన్ బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఆర్థిక నేరాల కేసుల్లో ఆయనపై విచారణ జరుగుతూనే ఉంది. ఆ విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. అయితే.. ఈ విచారణ పూర్తయితే జగన్ జైలుకు వెళ్తారా.. ఇది చాలా మందిలో ఉన్న సందేహం. అయితే అలాంటి అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.


ఏపీ సీఎం జగన్ పై పెట్టినవి క్విడ్ ప్రొ కో కేసులు అని.. అలాంటివి నిరూపించడం చాలా కష్టమని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. ఈడీ కేసుల్లో వాదనలు వినటం ప్రారంభం అయితే శిక్ష పడుతుందని.. అది కేవలం జరిమానా వరకే పరిమితం అవుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. ఆర్థిక నేరాలకు జరిమానాలు మాత్రమే విధించే అవకాశంం ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన అంటున్నారు. ఇక రాజకీయాల గురించి కూడా మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్..  రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉండదని.. ద్విముఖ పోరు మాత్రమే ఉంటుందన్నారు. బీజేపీ చెబితే.. జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవచ్చని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: